నిస్సందేహంగా అత్యంత తెలివైన తెలుగు దర్శకుల్లో ఒకరు హరీష్ శంకర్. రవితేజతో మిరపకాయ, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ తో డీజే, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ వంటి సూపర్ హిట్స్ హరీష్ శంకర్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. అయితే సినిమాలతోనే కాకుండా తన వ్యాఖ్యలతోను సోషల్ మీడియాలో నానుతూ ఉంటాడు. సామజిక అంశాలపై కూడా గళమెత్తే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మధ్య ఏ సినిమా ఈవెంట్ వెళ్లినా.. హీరోలని కాకా పట్టె తీరు విమర్శలపాలు చేస్తుంది. అసలు సినిమాలు తక్కువయ్యి.. పర్మినెంట్ గా సినిమా వేడుకలకే పరిమితమయ్యాడని ఎప్పటి నుండో హరీష్ శంకర్ పై విమర్శలు ఉన్నాయి.
అయితే తాజాగా బాలకృష్ణ వీర సింహారెడ్డి విజయోత్సవ సభకి హాజరయ్యాడు హరీష్ శంకర్. ఈ సందర్భంగా బాలకృష్ణతో పని చేయాలనీ ఉన్నట్టు సభ వేదికగా చెప్పాడు. బాలయ్య బాబు అంటే తనకి చాలా ఇష్టమని.. అవకాశం వస్తే బాబుతో కలిసి పనిచేయాలని ఉందంటూ కామెంట్స్ చేశాడు. అయితే అవకాశాల కోసం హరీష్ శంకర్ రిక్వెస్టులు చేయటం, దిగజారి అడుక్కువటం కొత్తేమి కాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ ఈవెంట్ కు వెళ్లినా అక్కడ కనిపించిన హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలని అడగడం నిర్మాతలను ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసుకోవడంపై ఇటు నెటిజన్లు అటు ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబును దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజినీ కాంత్ ను అలాగే విజయ్ దేవరకొండ రామ్ పోతినేనితో కలిసి పని చేయాలనుకుంటున్నానని వ్యాఖ్యలు చేశాడు.