గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యం - MicTv.in - Telugu News
mictv telugu

గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యం

May 19, 2017


రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యమమని మంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ పనితీరును మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ధాన్యం సేకరణ, గోడౌన్లు, పండ్ల మార్కెట్లు ఇతర అంశాలపై సమీక్ష జరిపారు.

మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 330 గోడౌన్ల నిర్మాణానికి గాను 1024 కోట్లను గతంలో నాబార్డు మంజూరు చేసింది.ఇందులో 321 గోడౌన్ల నిర్మాణం చేపట్టారు. వీటికి టెండర్లు 20 శాతానికి పైగా లెస్ కు దాఖలయ్యాయి.దీంతో మిగిలిన నిధులతో పాటు మరి కొన్ని నిధులివ్వాలని నాబార్డు ను మార్కెటింగ్ శాఖ కోరింది.
ఒక లక్షా 22 వేల 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో అదనంగా 34 గోడౌన్ల ను నిర్మించేందుకు నాబార్డు 73.50 కోట్లు మంజూరు చేసింది. 300గోడౌన్ల నిర్మాణం పూర్తైనట్టు అధికారులు తెలిపారు. మిగతా 21 గోడౌన్లు వీలయినంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 11 కొల్డ్ స్టోరేజ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. దేవరకొండ లోని దొండకాయల మార్కెట్, పటన్చేరులో ఉల్లిగడ్డ మార్కెట్ ఇతర పండ్ల మార్కెట్లు 3 నెలల్లో అందుబాటులో తీసుకు రావాలని ఆదేశించారు. గడ్డి అన్నారం మార్కెట్ కోహెడ కు తరలింపుపై సమీక్షించారు. ఖమ్మం మిర్చి మార్కెట్ ను రఘునాథపాలెం కు తరలించే ప్రయత్నాలను సమీక్షించారు.
అటు గరంలో మన కూరగాయలు పథకం అవుట్‌లెట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. జంట నగరాల్లో వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు తెస్తామన్నారు. హైదరాబాద్‌లో 40 మన కూరగాయలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. జూన్ 2 నాటికి నగరంలో మరో పది కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాబోయే రెండేళ్లలో వంద కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.