12 వారాలు రైడ్ చేయండి.. హార్లీ డేవిడ్స్‌ను ఫ్రీగా కొట్టేయండి - MicTv.in - Telugu News
mictv telugu

12 వారాలు రైడ్ చేయండి.. హార్లీ డేవిడ్స్‌ను ఫ్రీగా కొట్టేయండి

April 25, 2018

పురుషుల్లో పుణ్యపురుషులు వేరన్నట్లు.. బైకుల్లో హార్లీ డేవిడ్సన్ బైకుల కథే వేరు. దీన్ని నడపాలని ఉవ్విళ్లూరని కుర్రాళ్లు ఉండరు. అయితే ఖరీదు మోడల్‌ను బట్టి ఐదారు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉండడంతో చాలామంది జస్ట్ వాటిని చూస్తూ తృప్తిపడతుంటారు. అలాంటి వారికి హార్లీ డేవిడ్స్ కంపెనఅ బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 12 వారాల పాటు ఈ బైక్ నడిపి అనుభవాలు వివరిస్తే బైక్‌ను గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.  

అర్హతలు, ప్రక్రియ ఇలా..

కొత్తగా ఆలోచించే 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. మే 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ వేసవిలో కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ కింద పేరు నమోదు చేసుకోవాలి. దీనికోసం స్వేచ్ఛ అనే అంశంపై ఒక చిన్న వ్యాసాన్ని, లేదా ఫోటో గ్యాలరీని, లేదా వీడియోను రూపొందించి [email protected] కు పంపాలి. ఎంపికైన అభ్యర్థులకు బైక్ ఎలా నడపాలో శిక్షణ ఇస్తారు. ట్రావెలింగ్ అలవెన్సులూ ఇచ్చి, హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ తాళాలు జేబిలో పెడతారు. తర్వాత వారు 12వారాలపాటు  బైక్‌పై చక్కర్లు కొట్టాలి. రైడింగ్ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకోవాలి. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయాలి. ఈ పోస్ట్‌లలో బెస్ట్ పోస్ట్ రాసిన రైడర్‌కు హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ను పూర్తి ఉచితంగా అందిస్తారు.