హార్లే డేవిడ్సన్ కొత్త మోడల్.. మామూలుగా లేదుగా..  - MicTv.in - Telugu News
mictv telugu

హార్లే డేవిడ్సన్ కొత్త మోడల్.. మామూలుగా లేదుగా.. 

September 28, 2020

harley davidson revival electric bike

భారీ ఆకారం, భారీ శబ్దం, భారీ ధరతో కుర్రాళ్లనే కాకుండా పెద్దాళ్లను కూడా తనవైపు తిప్పుకునే హార్లీ డేవిడ్సన్ బైకులు కొత్త రూపు రేఖలు సంతరించుకున్నారు. కరోనా ప్రభావం, సేల్స్ తగ్గడంతో హార్లీ మన దేశం నుంచి తట్టాబుట్టా సర్దేస్తున్నట్లు ప్రకటించినా బైక్ ప్రియుళ్లను అది ఊరిస్తూనే ఉంది. కరోనా పూర్తిగా తగ్గి, జనం జేబుల్లో తిరిగి కాస్త డబ్బు చేరగానే దుకాణాన్ని మళ్లీ తెరిచే అకాశం లేకపోదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కంపెనీ సరికొత్త మోడళ్లను ఆవిష్కరిస్తోంది. పాత మోడల్స్‌కు కొత్త సొబగులు అద్దుతూ ట్రెండీ డిజైన్స్ తీసుకొస్తోంది. 

harley davidson revival electric bike

ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే ‘రివైవల్’ మోడల్ బైక్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. కాలానికి తగ్గట్టుగా పర్యావరణ అనుకూల, స్టైలిష్ డిజైన్లను కలగలిపి దీన్ని తయారు చేశారు. అయితే బరువును మాత్రం కొత్త జనరేషన్ అభిరుచులకు తగ్గట్లు కొంత తగ్గించారు. గేర్లు, క్లచ్చులు వంటి  ఫీచర్లతో మాత్రం రాజీపడలేదు. ఓపెన్ ఫ్రేమ్ డిజైన్‌తో  వచ్చిన ఈ బండికి రెండు ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఇస్తున్నారు. ఒకటి చార్జింగ్ అయిపోయాగానే రెండో దాన్ని పెట్టుకోవచ్చు. పూర్తి వివరాలు, ధర తదితరాలు ఇంకా వెల్లడి కాలేదు.