ప్రపంచ ప్రఖ్యాత మోటర్ సైకిల్ తయారీదారు హార్లీ డేవిడ్సన్ భారత్‌లోని తన అభిమానులకు చేదు వార్త తెలిపింది. అమెరికాకు చెందిన ఈ దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీ ఇండియాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అమ్మకాలు, తయారీ సర్వీసులు బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో 70 మంది ఉద్యోగులను కూడా తొలగించింది. రెండు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై అమెరికా మార్కెట్‌పైనే పూర్తిగా దృష్టి సారిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
2020లో కంపెనీ రిస్ట్రక్చరింగ్ కాస్ట్ దాదాపు 169 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని హార్లీ డేవిడ్సన్ పేర్కొంటోంది. కంపెనీ అంతర్జాతీయ విక్రయాల్లో భారత్ నుంచి కేవలం 5 శాతం వాటా ఉందని కంపెనీ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ఇండియాలో హార్లీ డేవిడ్సన్ బైక్స్ దిగుమతులపై అధిక సుంకం విధిస్తోందని తెలిపారు. హార్లీ డేవిడ్సన్ ఇండియాలో
తన కార్యకలాపాలను బంద్ నిలిపివేయడానికి ఇది ఒక కారణం అయి ఉండవచ్చు అని తెలుస్తోంది. హార్లీ డేవిడ్సన్ ఇండియాలో కార్యకలాపాలను ఆపివేయడం కేంద్ర ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.