టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

January 12, 2020

jhgfjbv

ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళా జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ‌ఈ జట్టుకు సారధ్యం వహించనుంది. 15 మంది సభ్యులతో జట్టుని ప్రకటించింది. ఈ ప్రపంచ కప్‌లో భారత్ గ్రూప్‌-ఎలో చోటు ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. వచ్చేనెల 21న ఆసీస్‌తో భారత తొలిపోరు జరుపనుంది.

టీ20 సిరీస్‌కు భారతజట్టు: హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా(విక్కెట్ కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.