Harsh comments on Ayyappaswamy.. Bairi Naresh is finally arrested
mictv telugu

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. భైరి నరేష్ అరెస్ట్

December 31, 2022

Harsh comments on Ayyappaswamy.. Bairi Naresh is finally arrested

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్పస్వామిని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని అయ్యప్ప మాలాధారులు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్‌పై సులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా భైరి నరేష్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. కరీంనగర్ వెళ్తుండగా వరంగల్‌లో అరెస్ట్ చేశారు. కాసేపట్లో అతడిని కొడంగల్‌కు పోలీసులు తరలించనున్నారు. భైరి నరేష్ అరెస్ట్‌పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని రెండు రోజులుగా అయ్యప్పస్వాములు ఆందోళణలు చేస్తుండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అయ్యప్పస్వాములు ఆందోళనలు చేస్తున్న క్రమంలో.. దానిని వీడియో చిత్రీకరించడానికి వచ్చిన భైరి నరేష్‌ అనుచరుడిని పొట్టుపొట్టు కొట్టారు.