కుబేరులు బ్రాండెడ్ దుస్తులు ఎందుకు వేసుకోరో తెలిస్తే దిమ్మ తిరుగుద్ది - MicTv.in - Telugu News
mictv telugu

కుబేరులు బ్రాండెడ్ దుస్తులు ఎందుకు వేసుకోరో తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

May 24, 2022

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ తదితర సిరిమంతుల దుస్తులను ఎప్పుడైనా గమనించారా? వారు చాలా సాదాసీదాగా ఉండే దుస్తులనే ధరిస్తారు. ఏదో మీటింగులు ఉన్నప్పుడు తప్ప సూటు, బూటు, బ్రాండెడ్ దుస్తులు అనే పిచ్చి వ్యామోహం వారికి ఉండదు. ఈ విషయం తెలుసుకోవాలనే కుతూహలం ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకాకు కలిగింది.

దీంతో ఆయన ఓ బిలీయనీర్‌ను ఈ ప్రశ్న అడిగాడట. దానికి ఆయనిచ్చిన సమాధానం వింటే ఆయనకే కాదు, మనకు కూడా దిమ్మతిరిగి పోద్ది. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే ‘ఎంతటి బ్రాండెడ్ దుస్తులైనా, ఎంత ఖరీదు గలవి అయినా ఉతికి ఆరేసే బట్టల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్. ఎంత మన్నిక గలవి అయినా కొన్నాళ్లకు అవి చిరిగిపోతాయి. కాబట్టి వాటి మీద అంత డబ్బు పెట్టే బదులు ఏదైనా రంగంలో పెట్టుబడి పెడితే బిజినెస్ పెరుగుతుంది లేదా డబ్బు పెరుగుతుంది.

చాలా మంది సమాజంలో వారు వేసుకున్న బట్టలను చూసి, తిరిగే కార్లను చూసి విలువిస్తారు. అలాంటి విలువ మీద నాకు నమ్మకం లేదు. నేనేంటో నా పని నిర్ణయిస్తుంది. అంతేకానీ, నేను ధరించే బ్రాండెడ్ దుస్తులు కాదు’ అని చెప్పాడంట. ఈ విషయాన్ని గోయెంకా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు నిజమే కదా అని ఏకీభవిస్తున్నారు.