హరీశ్‌రావుకు నష్టపరిహారం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ భూసేకరణ పకడ్బందీగా సాగుతోంది. ఇందులో భాగంగా నీటిపారుదల మంత్రి హరీశ్ రావు భూమిని కూడా సేకరించారు. ఆయనకు రూ. 2.12 కోట్ల పరిహారం చెల్లించారు. హరీశ్‌రావుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలోని సర్వే నంబరు 196లో 7–24 ఎకరాల భూమి ఉంది.

అలాగే  సర్వే నంబరు 178లో 9–19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీటిని ఆయన  2011లో కొన్నారు. ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో ఇవి కూడా ఉన్నాయి. వీటిని హరీశ్ టీఎస్‌ఐఐసీ పేరు మీద రిజిస్టర్ చేశారు. అందుకుగాను ఒక్కో ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున రూ.2.12 కోట్లను ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

SHARE