మాట మార్చిన మాజీ కేంద్ర మంత్రి.. రెండు రోజుల్లోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

మాట మార్చిన మాజీ కేంద్ర మంత్రి.. రెండు రోజుల్లోనే..

September 19, 2020

VNGJ

ఇటీవల తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం రేపిన శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ మాట మార్చారు. తాను కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సవరణ బిల్లును వ్యతిరేకించలేదని యూటర్న్ తీసుకున్నారు. తన రాజీనామా బిల్లుకు వ్యతిరేకంగా చేయలేదని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బిల్లుకు అందరూ మద్దతు పలకాలని ఆమె కోరారు. రైతు వ్యతిరేక బిల్లు అంటూ తాను ఎక్కడా వ్యాఖ్యానించలేదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 

వ్యవసాయ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. ఆ వెంటనే ఓ సోదరిగా రైతుల పక్షాన నిలబడటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. దీంతో అంతా బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా చేశారని భావించారు. ఇప్పటికే ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కానీ తీరా ఆమె యూటర్న్ తీసుకున్నారు.  రైతులే ఆ మాట అన్నారని పేర్కొన్నారు. మరి ఆమె రాజీనామా చేసిన సమయంలో ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.