బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా

October 24, 2019

Haryana  ..

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ కనీసం మ్యాజిక్ ఫిగరైన 46 స్థానాలను కూడా గెలిచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం బీజేపీ 37 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జానాయక్ జనతా పార్టీ దాదాపు 20 స్థానాల్లో ముందంజలో ఉంది. 

బీజేపీకి చెందిన ఏడుగురు మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. దీంతో జేజేపీ పార్టీ కింగ్ మేకర్‌గా మారనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో హరియాణాలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంశాఖ మంత్రి అమిత్‌షాకు పంపించారు. ఇక మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం దిశగా పయనిస్తోంది. తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిపై దాదాపు 30వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.