ఏ బటన్ నొక్కినా ఓటు కమలానికే వెళ్తుంది..బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ఏ బటన్ నొక్కినా ఓటు కమలానికే వెళ్తుంది..బీజేపీ ఎమ్మెల్యే

October 21, 2019

ఈవీఎం మెషిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణా బీజేపీ ఎమ్మెల్యే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసంద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే భ‌క్షిష్ సింగ్ విర్క్ ఓ ఎన్నికల మీటింగ్‌లో ప్రసంగిస్తూ ఓటర్లకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 

ఈవీఎంలో ఎవ‌రెవ‌రు ఏ బ‌ట‌న్ నొక్కుతున్నారో త‌మ‌కు తెలుస్తుందన్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్య‌క్తి అని, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కూడా తెలివైన వ్య‌క్తే అని, మీరు ఏ బ‌ట‌న్ నొక్కినా.. అది బీజేపి ఖాతాలోకి వెళ్తుంద‌న్నారు. ఆ వీడియోను ట్వీట్ చేసిన రాహుల్‌ గాంధీ.. బీజేపీలో అత్యంత నిజాయితీప‌రుడైన నేత ఈయ‌నే అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈవీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే భ‌క్షిష్ సింగ్ విర్క్‌కు ఎన్నికల సంఘం నోటిసులు జారీ చేసింది.