సైకిల్ తొక్కుతూ వచ్చి ఓటేసిన ముఖ్యమంత్రి..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

సైకిల్ తొక్కుతూ వచ్చి ఓటేసిన ముఖ్యమంత్రి..వీడియో

October 21, 2019

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వినూత్నంగా సైకిల్ తొక్కుతూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైకిల్‌పై కర్నాల్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఖట్టర్ తెలిపారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ తన సతీమణి అమృత, తల్లి సరితలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్‌పూర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హుజూర్ నగర్ అప్ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.