నీ మెడ నరికేస్తా.. హరియాణా సీఎం సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

నీ మెడ నరికేస్తా.. హరియాణా సీఎం సంచలన వ్యాఖ్యలు

September 12, 2019

సహనం కోల్పోయి సొంత కార్యకర్తలపైనే అనుచితంగా ప్రవర్తించడం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు పరిపాటిగా మారింది. తాజాగా ఆయన ఓ కార్యకర్తను మెడ నరికేస్తా అంటూ కోపంతో ఊగిపోయాడు. జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. యాత్రలో భాగంగా ఓపెన్‌ మినీ ట్రక్‌ టాప్‌పై నిలబడి ఖట్టర్‌ కు ఓ కార్యకర్త గొడ్డలిని బహూకరించారు. గొడ్డలి ర్యాలీలోని ప్రజలకు చూపిస్తుండగా మరో కార్యకర్త ఆయన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన సీఎం తన చేతిలో ఉన్న గొడ్డలి చూపిస్తూ మెడ నరికేస్తా అంటూ అరిచాడు. దీంతో వెంటనే అతడు చేతులు జోడించి క్షమాపన చేెప్పాడు. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. 

గతంలోనూ సొంత కార్యకర్తలపై చిందులు తొక్కిన ఘటనలు ఉన్నాయి. ఓ కార్యక్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు చేతిపై బాదడంతో ఆ ఫోన్ కాస్త కిందపడిపోయింది. అయితే తాజా ఘటనపై ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. కిరీటాలను తొడిగే రాజరిక సంప్రదాయానికి చరమగీతం పాడామని అన్నారు. అందుకే తనకు ఎవరైనా కిరీటం తొడిగేందుకు ప్రయత్నిస్తే తనకు కోపం వస్తుంద చెప్పారు. కోపంలో తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు.