ఆ రేపిస్ట్ ఎమ్మెల్యే మనకు అవసరమా..ఉమా భారతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రేపిస్ట్ ఎమ్మెల్యే మనకు అవసరమా..ఉమా భారతి

October 25, 2019

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో హాంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 46 ఎమ్మెల్యేలు అవసరం. కాగా, అధికార బీజేపీ 40 సీట్ల దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో గెలుపొందింది. కొత్త జేజేపీ 10 స్థానంలో గెలుపొందగా మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొత్త పార్టీ జేజేపీ, స్వతంత్రులతో మంతనాలు జరుపుతున్నాయి. 

బీజేపీ పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో ఎమ్మెల్యే గోపాల్ కండా కూడా ఉన్నారు. గ‌తంలో బీజేపీలోనే ఉన్న గోపాల్.. అత్యాచార ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. తాజా ఎన్నికల్లో సిర్‌సా నుంచి గెలిచారు. గోపాల్ కండా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యాడు. బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తానంటూ ముందుకువ‌చ్చాడు. కానీ, ఆ పార్టీ సీనియర్ మ‌హిళా నేత‌ ఉమా భారతి ఆ ఎమ్మెల్యేను తీసుకోవ‌ద్దు అంటూ త‌న అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నా.. కానీ, గోపాల్ లాంటి ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోరాదని ఆమె ట్వీట్ చేశారు. పార్టీలో ప్రధాని మోదీ లాంటి శ‌క్తివంత‌మైన నేత ఉండగా గోపాల్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకని ఆమె ప్ర‌శ్నించారు.