కారులో వెళుతూ డబ్బులను రోడ్డు మీదకు విసిరిన యూట్యూబర్ - MicTv.in - Telugu News
mictv telugu

కారులో వెళుతూ డబ్బులను రోడ్డు మీదకు విసిరిన యూట్యూబర్

March 15, 2023

 

Haryana-man-was-throwing-currency-notes-from-his-running-car, 

 

సోషల్ మీడియాలో కంటెంట్ కోసం పిచ్చి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.  ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోనే ఇందుకు నిదర్శనం కొడుతోంది. ఓ వ్యక్తి కారులోంచి డబ్బులు విసురుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. జనాల మీద ఓటీటీలు, వాటిల్లో వచ్చే వెబ్ సిరీస్‌ల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ వ్యక్తి నడుస్తున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరాడు. ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశాన్ని సేమ్ టు సేమ్ రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు సదరు వ్యక్తి .  ఈ పని చేసింది యూట్యూబర్ జోరావర్ సింగ్, అతని ఫ్రెండ్  గురుప్రీత్ సింగ్‌లు. ఇంతా చేస్తే అదంతా ఫేక్ కరెన్సీ. కేవలం యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే ఆ పనిని చేశారుట.  వీళ్ళిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో కారులోంచి కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు సిరీస్‌లోని సన్నివేశాన్ని మళ్ళీ రూపొందించడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోలీసులకు తెలిసింది.  పోలీసులు  వెంటనే కేసు నమోదు చేశారు. అంతకుముందు కూడా ఇలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. జనవరిలో బెంగళూరులోని కేఆర్ పురం ఫ్లైఓవర్ నుండి ఒక గుర్తుతెలియని వ్యక్తి నగదు రూ. 10 నోట్లు కింద నిలబడి ఉన్న వ్యక్తులపైకి విసారాడు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయి జనాలు ఇబ్బంది పడ్డారు.