రోజుకు 32లీటర్ల పాలు..’సరస్వతి’ ప్రపంచ రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

రోజుకు 32లీటర్ల పాలు..’సరస్వతి’ ప్రపంచ రికార్డు

December 10, 2019

Haryana’ murrah buffalo yields 32.6 litter milk.

సాధారణంగా గేదె రోజుకు మహా అయితే 5 నుంచి 6 లీటర్ల పలు ఇస్తుంది. కానీ, హరియాణా రాష్ట్రం హిసార్ జిల్లాలో ముర్రా జాతికి చెందిన సరస్వతి అనే గేదె రోజుకి ఏకంగా 32 లీటర్ల పాలు ఇచ్చి, ప్రపంచరికార్డు సృష్టించింది. గతేడాది నవంబర్‌లో పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె నెలకొల్పిన రికార్డును సరస్వతి అధిగమించింది. సరస్వతి వయసు ఏడేళ్లు. పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ప్రోగ్రసివ్ డైరీ ఫార్మర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ డైరీ అండ్ అగ్రి ఎక్స్పో పోటీలో సరస్వతి పాలవెల్లువ సృష్టించింది. 

వరుసగా మూడు రోజుల పాటు 32 లీటర్లకు తగ్గకుండా పాలివ్వడంతో సరస్వతి వరల్డ్ రికార్డు సృష్టించినట్టు నిర్వాహకుడు దల్జీత్ సింగ్ సదార్పురా ప్రకటించాడు. సరస్వతి పాలతోనే కాకుండా తన అండాలతోనూ ఎంతో సంపాదన తెచ్చిపెడుతోంది. ఇది ముర్రా జాతికి చెందిన గేదె కావడంతో దీని నుంచి తయారయ్యే అండాల నుంచి కృత్రిమ పద్ధతుల్లో దూడలను ఉత్పత్తి చేస్తున్నారు. సరస్వతిని అమ్మాలంటూ రూ.51 లక్షల ఆఫర్ వచ్చినా దీని యజమాని సుఖ్‌బీర్ ధండా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇటీవల సరస్వతికి పుట్టిన దూడను రూ.4.5 లక్షలకు అమ్మారు.