Haryana police have recovered Rs. 50 lakhs from the beggar
mictv telugu

బిచ్చగాడి సంచిలో అక్షరాలా 50 లక్షలు

June 14, 2022

Haryana police have recovered Rs. 50 lakhs from the beggar

ఆలయాల వద్ద బిచ్చం ఎత్తుకొని జీవించే బిచ్చగాడి వద్ద ఉన్న డబ్బులు చూసి పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారమిచ్చి వారిని రంగంలోకి దింపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. బిచ్చగాడు సంచీలో మూటలతో ఓ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తుండగా, పెట్రోలింగ్ పోలీసులు అనుమానం వచ్చి అతడిని ఆపారు. సంచీలో ఏముంది? గన్ను లాంటిదేమైనా ఉందా? అని ప్రశ్నించగా, బిచ్చగాడు పొడిపొడిగా సమాధానమిచ్చాడు.

దాంతో పోలీసులే సంచీలను విప్పి అందులోని మూటలను పరిశీలించగా, రెండు కవర్లలో పెద్ద ఎత్తున ధనం లభ్యమైంది. దాదాపు రూ. 50 లక్షల వరకు డబ్బు ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దాంతో ఆదాయపన్ను శాఖ వారిని పిలిపించగా, వారు వచ్చి డబ్బును, బిచ్చగాడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంత డబ్బు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది.