ఈ నెల 27 నుంచి మోగనున్న బడి గంట! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నెల 27 నుంచి మోగనున్న బడి గంట!

July 1, 2020

schools

లాక్ డౌన్ కారణంగా మర్చి 22 నుంచి దేశవ్యాప్తంగా అన్ని విద్య సంస్థలు మూసివేయబడిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం రెండవ దశ అన్ లాక్ లో భాగంగా మరిన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో ఈ నెల 27 నుంచి పాఠశాలలను తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు హరియాణా రాష్ట్ర విద్యా శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ నెల ఒకటో తేదీ నుంచి 26 వ తేదీ వరకు వేసవి సెలవులుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఈ నెల 31 వ తేదీ వరకు మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. ‘ఇ-లెర్నింగ్’ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కళాశాలల యాజమాన్యాలతో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సిలర్లు చర్చించిన తర్వాతే… వాటిని ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని విద్యాశాఖ వెల్లడించింది.