బయటికొస్తే రూ.1000.. హరియాణా సర్కార్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

బయటికొస్తే రూ.1000.. హరియాణా సర్కార్ ఆఫర్

March 25, 2020

Haryana state government launches 'Covid-Sangharsh Senani'

కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 21రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌‌ను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్‌ను తట్టుకుని బయటకు వచ్చి పనిచేస్తున్న వారికి ఇంటెన్సివ్‌ల రూపంలో రూ.100 నుంచి రూ.1000 ఇవ్వాలని నిర్ణయించింది. 

దీని కోసం ‘కొవిడ్ సంఘర్ష్ సేనాని స్కీం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యువత మొదలు వృద్ధుల వరకు ఎవరైనా సరే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శ్రమిస్తే వారికి ఈ డబ్బును అందజేస్తారు. ఇందులో భాగంగా వారు పద్యం, కథ, పాట, సందేశం, స్పీచ్ ఏదైనా చెప్పి ప్రచారం చేయొచ్చు. వీటిని రికార్డు చేసి haryana.mygov.in వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలి. వాటిలో 100 బెస్ట్ సెలక్ట్ చేసి క్యాష్ రివార్డు అందజేస్తారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో 112 ప్రభుత్వ పాఠశాల్లో 1.87లక్షల విద్యార్థుల చదువుకి ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాధ్యాయులు తరగతులను వీడియో రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.