14 ఏళ్ల బాలుడిపై మహిళ అత్యాచారం.. గాలిస్తున్న పోలీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

14 ఏళ్ల బాలుడిపై మహిళ అత్యాచారం.. గాలిస్తున్న పోలీసులు 

January 14, 2020

hbv

అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా అత్యాచారాలు సాగుతున్నాయి. అయితే కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే వెలుగుచూస్తున్నాయి. హరియాణాలోని పాల్వాల్ ప్రాంతంలో 29 ఏళ్ల మహిళ 14 ఏళ్ల వయసున్న బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. పోలీసులును ఆమెను పట్టుకోడానికి విస్తృతంగా గాలిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలి భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు దగ్గర్లోనే నివసిస్తున్న ఓ బాలుడు పరిచయమ్యాడు. ఇద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అతడు ముఖం చాటేశాడు. దీంతో ఆమె అతనిపై కేసు పెట్టింది. తనను శారీరకంగా వాడుకుని, గర్భం ధరించాక పెళ్లాడ్డానికి నిరాకరించాడని ఆరోపించింది. కేసును విచారించిన కోర్టు బాలుడిని నిర్దోషిగా వదిలేసింది. మైనర్‌తో శృంగారం జరిపినందుకు అత్యాచారం కింద ఆమెపై కేసు పెట్టాలని ఆదేశించింది. ఆమె పరారీలో ఉందని పోలీసులు చెప్పారు. 

ఐపీసీలోని 375 చట్టం ప్రకారం మహిళపై అత్యాచారం కేసులో జెండర్ న్యూట్రాలిటీ ఉండదు. అంటే నేరానికి పాల్పడింది మహిళ అయితే ఆమెకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఒక స్త్రీ, మరో స్త్రీని అత్యాచారం చేయడం సాధ్యం కాదనే భావనతో ఈ చట్టాన్ని అన్వయిస్తాయి అయితే పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో చట్టం కింద ఇలాంటి మినహాయింపు ఉండదు. నేరానికి ఒడిగట్టిన మహిళను కూడా శిక్షిస్తారు. అయితే ఇలాంటి కేసులు అరుదు కావడంతో జెండర్ న్యూట్రాలిటీనే అన్వయిస్తూ ఉంటారు.