దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి!

June 6, 2020

Dawood Ibrahim

కరోనా వైరస్ కాటుకు మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మృతిచెందాడని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. 1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో ఐఎస్‌ఐ ఆశ్రయంలో ఉంటున్న దావూద్‌అతడి భార్య మెహజబీన్‌‌లకు కరోనా సోకిందని వినిపిస్తోంది. దీంతో వారిని కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అతని సిబ్బందిని కూడా నిర్బంధంలో ఉంచినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం మాట్లాడుతూ.. దావూద్‌కు, అతని కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ కరోనా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. వారందరూ తమ ఇంట్లో ఉన్నారని కూడా చెప్పారు.

అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం దావూద్ చనిపోయాడని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్‌ ఎక్స్‌ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దావూద్‌ మృతి చెందాడని తెలిపింది. ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌‌ అవుతోంది. దీంతో చాలామంది నెటిజన్లు దావూద్ మృతిచెందాడని భావిస్తున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్‌ చేసిందని కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే అతని మృతిపై సరైన సమాచారం లేదు. అయినా వార్తలు మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లలో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న దావూద్‌ ఇబ్రహీం ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో ఉంటున్నాడు.