Has our wedding become so viral!..I didn't expect it: Actress Mahalakshmi
mictv telugu

మా పెళ్లి ఇంత వైరల్ అయ్యిందా!: నటి మహాలక్ష్మీ

September 4, 2022

తమిళ ఇండస్ట్రీకి చెందిన..సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ, తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్‌లు సెప్టెంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సామాన్యంగా ఏ ఇండస్ట్రీలోనైనా ఫేమస్ అయిన నటీనటులు పెళ్లి చేసుకుంటే, వారి ఫోటోలు వైరల్ అవుతాయి. కానీ, సీరియల్ నటీ జే మహాలక్ష్మీ, నిర్మాత రవిందర్ చంద్రశేఖర్‌ల పెళ్లి ఫోటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం..నిర్మాత రవీందర్‌ భారీ కాయం, మహాలక్ష్మీ సన్నగా ఉండటమే.

ఈ క్రమంలో పెళ్లైన రోజు నుంచి ఈరోజు వరకు ఈ జంటను తెగట్రోల్‌ చేస్తూ, నెటిజన్స్ విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు. అందులో ముఖ్యంగా..‘అలాంటి వ్యక్తిని మహాలక్ష్మి ఎలా పెళ్లి చేసుకుంది?. ఇది నిజమా?’,‘డబ్బు కోసమే ఆయనను ఆమె పెళ్లి చేసుకుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఓ తెలుగు యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌పై ఈ జంట స్పందించింది.

మహాలక్ష్మి మాట్లాడుతూ..”ఆయన బరువు నాకు పెద్ద సమస్య కాదు. నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టపడ్డాను. ఆయన బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని నేను చెప్పాను. బరువు గురించి చాలా సార్లు మాట్లాడారు. ఫారెన్‌ వెళ్లి ట్రాన్స్‌ఫాం అవుతా అన్నారు. కానీ, అవేవీ చేయోద్దండి, మీరు ఉన్నట్టే ఉండండి అని చెప్పాను. కానీ, మా పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదు. చాలా మంది మాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, మరికొందరు సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా నాపై బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎదుటివారి లైఫ్ అనేసరికి అందరు సులువుగా మాటలు అనేస్తారు. వాటికి నేను పెద్దగా కుమిలిపోను” అని ఈ జంట చెప్పుకొచ్చింది.