నిర్భయ లాయర్ చేతికే హత్రాస్ అత్యాచార కేసు! - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ లాయర్ చేతికే హత్రాస్ అత్యాచార కేసు!

October 2, 2020

Hathras Case to Nirbhaya's Lawyer Seema

నిర్భయ అత్యాచార కేసులో విజయం సాధించి దోషులకు ఉరిశిక్ష పడేలా పోరాటం చేసిన లాయర్ చేతికే హత్రాస్ కేసు కూడా వెళ్లింది. లాయర్ సీమా కుష్వాహా ఈ కేసును తీసుకుంటానని పేర్కొన్నారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని వెల్లడించారు. దీని కోసం ఆమె బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు కూడా వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయారు. అధికారులు తనకు అంతరాయం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా కూడా తాను ఈ కేసును వాదిస్తానని స్పష్టం చేశారు. బాధితురాలి అన్నతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.. 

2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  ఈ కేసును వాదించేందు సీమానే ముందుకు వచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చివరకు దోషులకు శిక్షపడేలా చేశారు. దీంతో ఆమె పేరు యావత్ దేశానికి తెలిసింది. ప్రస్తుతం హత్రాస్ ఘటనతో మరోసారి సీమా తెరపైకి వచ్చారు. ఈ కేసులోనూ న్యాయం జరిగేలా చేయాలని పలువురు కోరుతున్నారు.