ఆయన బాధితులకు న్యాయం చేయాల్సిన జిల్లా కలెక్టర్. కానీ ఆయనే స్వయంగా బెదిరించాడు. అది కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హత్రాస్ కేసులో. మనీషా వాల్మీకి కుటుంబంతో మాట్లాడుతూ ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘మీడియా ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది.. ఇక్కడ ఉండేది మేమే.. నీ వాంగ్మూలం మార్చుకుంటావో లేదో నీ ఇష్టం. కోర్టుకు మీకు న్యాయం చేస్తాయి.’ అని జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ అయిన ప్రవీణ్ కుమార్ లక్సర్ మృతురాలి తండ్రికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మనీషా కుటుంబ సభ్యుల అనుమతితోనే ఆమె అంత్యక్రియలను అర్ధరాత్రి పూర్తి చేశామని అధికారులు, పోలీసులు చెబుతున్నారు. అయితే తమ అనుమతి తీసుకోలేదని ఆమె తండ్రి అంటున్నాడు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
#Hathras District Magistrate threatening victims father! @RahulGandhi @priyankagandhi pic.twitter.com/eXt9SrHtEn
— Rukshmanii kumari (@KumariRukshmani) October 1, 2020
మనీషా వాల్మీకిపై గత నెల 14న అఘాయిత్యం జరగడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూయడం తెలిసిందే. అయితే అత్యాచారం జరగలేదని, దాడి చేయడం వల్లే చనిపోయిందని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. సాక్ష్యాలను నాశనం చేయడానికే మనీషాను ఆమె కుటుంబ సంప్రదాయం ప్రకారం ఖననం చేయకుండా దహనం చేశారని ఆరోపలు వస్తున్నాయి.