మనీషాపై అత్యాచారం జరగలేదు.. ఫోరెన్సిక్ నివేదిక - MicTv.in - Telugu News
mictv telugu

మనీషాపై అత్యాచారం జరగలేదు.. ఫోరెన్సిక్ నివేదిక

October 1, 2020

Hathras issue forensic report Uttar Pradesh .

హత్రాస్ దారుణంపై దేశమంతా తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. దోషులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అయితే దళిత యువతి మనీషా వాల్మీకిపై అసలు అత్యాచారమే జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఆమెను కొట్టి గాయపరిచిన మాట నిజమేనన్న పోస్ట్ మార్టం నివేదికను బయటపెట్టిన పోలీసులు ఫోరెన్సిక్ నివేదికలోని వివరాలంటూ ఈ విషయం చెప్పారు. 

ఆమె అవశేషాల్లో వీర్యం కనిపించలేదు. అత్యాచారం జరగలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక తెలిపింది. యూపీలో కులాల మధ్య విద్వేషం రగిల్చడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారు. ఎవరు ఈ ప్రచారం చేశారో గుర్తించి శిక్షిస్తాం.. ’ అని యూపీ ఏడీజీ లా అండ్‌ ఆర్డర్‌ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. మరోపక్క.. మనీషా కుటుంబానికి, నిందితుల కుటుంబాలకు మధ్య గతంలో గొడవలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తను కావాలని ఇరికించేందుకు తప్పులు కేసులు పెట్టారని నిందితుల కుటుంబాలు చెబుతున్నాయి. నిందితుల్లో ఇద్దరు ఇదివరకే జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. గత నెల 14న గడ్డి కోయడానికి పొలానికి వెళ్లిన మనీషాపై రవికుమార్, సందీప్, రాంకుమార్, లవకుశ్ అనే యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.