ఖమ్మంలో హత్రాస్ తరహా సీన్.. పోలీసులపై విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మంలో హత్రాస్ తరహా సీన్.. పోలీసులపై విమర్శలు

October 16, 2020

hathras scene repeated in khammam

ఉత్తరప్రదేశ్ హత్రాస్ హత్యాచారం సంఘటనలో పోలీసులు చేసిన తప్పునే ఖమ్మం పోలీసులు కూడా చేశారు. హత్రాస్‌ బాధితురాలి శవాన్ని పోలీసులు అర్థరాత్రి దహనం చేసి విమర్శల పాలయ్యారు. అలహాబాద్ హైకోర్టు సైతం యూపీ పోలీసుల చర్యను తప్పుబట్టింది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో జరిగింది. 

జిల్లాలోని పల్లెగూడేనికి చెందిన ఉప్పలయ్య కుమార్తె ఇటీవల అత్యాచారానికి గురైంది. దాదాపు నెల రోజుల పాటు ఉస్మానియా హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచింది. ఈ క్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి, సంతకాలు పెట్టించుకుని హుటాహుటిన మృతదేహాన్ని తరలించారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాను లోపల పోస్టుమార్టం నడుస్తుందని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.