హత్రాస్ హత్యాచారం.. అమాయక రైతుకు ఎంత కష్టం! - MicTv.in - Telugu News
mictv telugu

హత్రాస్ హత్యాచారం.. అమాయక రైతుకు ఎంత కష్టం!

October 19, 2020

Hathras  The farmer in whose field the incident took place, he asked for compensation, the reasons given.j

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన హత్రాస్ ఘటనలో ఓ అమాయక రైతుకు తీరని కష్టం వచ్చింది. ఆ రైతు పంట పొలంలో దుర్ఘటన జరగడంతో సీబీఐ అధికారులు పలుమార్లు పొలాన్ని పరిశీలించారు.  క్రైం సీన్‌ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమాని అయిన సదరు రైతును ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. దీంతో ఆ రైతు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. 19 ఏళ్ల దళిత బాలికపై హత్రాస్ జిల్లాలోని బూల్‌గర్హీ గ్రామంలోని పంట పొలంలో హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు అధికారులు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్‌ను పరిశీలించారు. 

క్రైం సీన్‌ ఉన్న పంట పొలానికి దూరంగా ఉండమనడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతు మాట్లాడుతూ.. ‘క్రైం సీన్‌లోని ఆధారాలను పరిరక్షించటానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టొద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు చెప్పారు. పైగా నిత్యం వస్తున్న అధికారులే కాకుండా చాలామంది పంటను తొక్కేశారు. దీంతో పంట నాశనమై రూ.50 వేల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’ అని సదరు రైతు డిమాండ్‌ చేశారు. చూడాలి మరి రైతు ఆవేదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.