దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ హత్రాస్ మృతురాలి కేసులో అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వారు నిందితులకు వత్తాసు పలుకుతున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మరోపక్క.. ఈ రోజు మృతురాలి స్వగ్రామం భాగ్నాలో అగ్రవర్ణాలు నిందితులకు న్యాయం చేయాలని ధర్నాకు దిగాయి. నిందితులకు అనుకూలంగా పంచాయతీ కూడా చేశారు. నిందితులను ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని, ‘సిట్’ను ఏర్పాటు చేసిన నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధికోసం దీనిపై రాద్ధాంతం చేస్తున్నయని అన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురూ మంచివాళ్లని చెప్పారు. మరోపక్క… దళితులు కూడా రాష్ట్రమంతంటా ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా భారీ ధర్నా జరిగింది.
हाथरस में पीड़िता के गाँव से करीब एक किलोमीटर दूर यह भीड़ आरोपियों में समर्थन में इकठ्ठा हुई है। इनका कहना है कि आरोपियों को गलत फंसाया जा रहा है और स्वर्ण बनाम दलित राजनीति का खेल खेला जा रहा है। कठुआ में भी ऐसा ही हुआ था, अब वैसा ही हाथयस मामले मे हो रहा है#BharatAtIndiaGate pic.twitter.com/lckJeZpB0v
— Wasim Akram Tyagi (@WasimAkramTyagi) October 2, 2020
యూపీలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత బాలిక మనీషా వాల్మీకినీ నలుగురు యువకులు చంపినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమ బిడ్డను వారు అత్యాచారం చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయం వల్లే ఆమె చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. మనీషాకు ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకునే అర్ధరాత్రి అంత్యక్రియలు చేశామని పోలీసులు, అనుమతి తీసుకేలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకోడానికీ మీడియా ప్రతినిధులు గ్రామానికి వెళ్తున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.