హ్యాట్సాఫ్ రాజమౌళి సార్: మహేశ్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాట్సాఫ్ రాజమౌళి సార్: మహేశ్ బాబు

March 26, 2022

 

mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆర్ఆర్ఆర్ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించిన టాలీవుడ్ హీరోలు వారి వారి అభిప్రాయానలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మహేశ్ బాబు ‘హ్యాట్సాఫ్ యూ రాజమౌళి సార్’ అంటూ రాజమౌళిని అభినందించారు.

01m

“సినిమాలు ఉంటాయ్. అక్కడే రాజమౌళి సినిమాలంటూ కూడా ఉంటాయ్.! ఆర్ఆర్ఆర్ సినిమా ఒక మహోన్నత దృశ్యకావ్యం. ఆ సినిమా భారీతనం, ఘనతర సన్నివేశాలు, సంగీతం, భావోద్వేగాలు ఏమాత్రం ఊహకందనివి. ఊపిరిబిగబట్టేలా చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనల్ని కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్‌లు చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. ఆర్ఆర్ఆర్ సినిమా అనుభూతిలో మనం కూడా లీనమైపోతాం.

రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడే ఇలాంటి కథను రక్తి కట్టించగలడు. రాజమౌళి సంచలనాత్మక రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో గర్విస్తున్నాం సర్! ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల గురించి చెపాల్సి వస్తే.. వారు తమ స్టార్ డమ్‌ను మించిపోయారు. వారి నటనా ప్రతిభ ప్రపంచం హద్దులు దాటింది. ‘నాటు నాటు’ పాట చూస్తే భూమ్యాకర్షణ సిద్ధాంతం వట్టిదే అనిపించేలా వారి పెర్ఫార్మెన్స్ ఉంది. సరిగ్గా చెప్పాలంటే వారు గాల్లో తేలిపోతున్నట్టుగా డ్యాన్స్ వేశారు” అంటూ ట్విట్ చేశారు.

అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ వంటి బృహత్తర చిత్రాన్ని అందించిన యావత్ చిత్రబృందానికి, హ్యాట్సాఫ్ చెబుతున్నాను. చాలా చాలా గర్విస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అంటూ మహేశ్ బాబు తన మనోభావాలను పంచుకున్నారు.