మీ టాలెంట్‌కి హ్యాట్యాఫ్..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

మీ టాలెంట్‌కి హ్యాట్యాఫ్..వీడియో వైరల్

July 2, 2022

ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను ఆయన షేరు చేస్తూ.. ‘జాతీయ బాస్కెట్ బాల్ జట్టు ఈమె కోసం వెతుకుతోంది’ అని కొన్ని వ్యాఖ్యలు జోడించారు. ఇక అంతే వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ ‘అమ్మా..మీ టాలెంట్‌కి హ్యాట్యాప్స్’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీడియోను పదే పదే చూస్తూ, ఆశ్చర్యానికి లోనైతున్నారు.

 

ఇంతకి ఆ వీడియోలో ఏముందో తెలుకుందామా.. ”ఆవు పేడతో ఓ మహిళ గోడపై పిడకలు విసురుతుంది. విశేషం ఏమిటంటే ఆ గోడ భారీ ఎత్తులో ఉంది. అయినా ఆ మహిళ అలవోకగా వరుస క్రమంలో అతికేలా పేడ ముద్దలను విసురుతుంది. అంతేకాదు క్రమం తప్పకుండ పిడకలను వరుస క్రమంలో ముద్దలను అతికేలా విసురుతుంది”. వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఈ క్లిప్పింగ్‌కి ఇప్పటికే 1.5 మిలియన్ల మంది వీక్షించారు. దాదాపు 40 వేల మంది లైక్ చేశారు. అనేక మంది ఆ మహిళ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ‘ఈమె తరహాలోనే దేశంలో అనేకమంది ప్రతిభావంతులు ఉన్నారు. వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.