554 ఉద్యోగాలకు ఆప్లై చేశారా.. రేపే లాస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

554 ఉద్యోగాలకు ఆప్లై చేశారా.. రేపే లాస్ట్

April 11, 2022

gnbgcnb

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు శుభవార్తను చెప్పింది. ప్రభుత్వ వైద్యారోగ్య సంక్షేమశాఖ విభాగానికి చెందిన వైద్య విధాన పరిషత్, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లో ఖాళీగా ఉన్న 554 పోస్టులను, రాతపరీక్షా లేకుండానే భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని, నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి, ఇంకా ఎవరైనా ఆప్లై చేసుకోనివారు ఉంటే రేపటికల్లా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎందుకంటే దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఎలా ఆప్లై చేయాలి? ఖాళీల సంఖ్య? జీతభత్యాలు? ఎంపిక విధానం? ఎలా ఉంటుందో ఆ సమాచారం మీకోసం..

మొత్తం ఖాళీలు.. 554

పోస్టుల వివరాలు..

1.సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

2. వయోపరిమితి..

జులై 1, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

3.పే స్కేల్..
నెలకు రూ.53,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

4. అర్హతలు..
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

5. ఎంపిక విధానం..
అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

6. దరఖాస్తు విధానం..
అసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

7. దరఖాస్తు రుసుము..
1. జనరల్ అభ్యర్థులకు రూ.1500
2. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

8. దరఖాస్తులకు చివరి తేదీ..
ఏప్రిల్ 12, 2022.
వెబ్‌సైట్..hmfw.ap.gov.in