Have you reached the target or else you have to drink raw eggs..
mictv telugu

టార్గెట్ రీచ్ అయ్యారా సరే..లేదంటే పచ్చి గుడ్లు తాగాల్సిందే..

August 26, 2022

చైనా దేశంలోని జెంగ్జౌ నగరంలో ఉన్న ఓ టెక్నాలజీ సంస్థ ఉద్యోగులకు విచిత్రమైన కండీషన్ పెట్టింది. ‘కంపెనీ ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యారా సరే సరి, లేకపోతే ఉద్యోగులంతా పచ్చి గుడ్లు తాగాల్సిందే’ అని నిబంధన విధించింది. దాంతో ఉద్యోగులంతా ఏం చేయాలో అర్ధంకాక సతమతమయ్యారు. ఇంతకి ఈ వింత నిబంధన ఆ కంపెనీ యాజమాన్యం ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సోషల్ మీడియా వెల్లడించాడు..”మా కంపెనీలో కొన్ని రోజులు ఇంటర్నెషిప్ ఉందని చెప్పారు. నాకు అప్పగించిన టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాను. దాంతో పనిష్మెంట్ కింద పచ్చి గుడ్లు తాగాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆ పని చేయలేక నేను ఉద్యోగం మానేశాను. కానీ, కొందరు ఉద్యోగులు కష్టపడి పచ్చి గుడ్లు తాగుతూ, వాంతులు చేసుకుంటున్నారు” అని అతడు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు.

”పని ఆధారంగా సంస్థలు ఉద్యోగులకు వేతనాలు పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. ఉద్యోగి పర్ఫామెన్స్ బాగుంటే..ఇంక్రిమెంట్లు, బోనస్‌లో రూపంలో సదరు ఉద్యోగిని మరింత బాగా పని చేసేలా ప్రోత్సహిస్తాయి. అదే పని తీరు బాగాలేని ఉద్యోగికి జీతంలో కోతలు విధిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తూ ఉంటాయి. కానీ, ఈ విచిత్ర నిబంధన ఏంటీ” అని నెటిజన్స్ మండిపడుతున్నారు.