గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు - MicTv.in - Telugu News
mictv telugu

గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు

November 17, 2019

Gambhir ....

టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజేపీ లోక్ సభ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు అనూహ్య అనుభవం ఏర్పడింది. గంభీర్ కనిపించడం లేదంటూ ఢిల్లీలోని కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలో కాలుష్యంపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో ఈ రకంగా పోస్టర్లు అంటించి ఢిల్లీ వాసులు నిరసన తెలిపారు.

‘ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూశారా?’ ఈయన చివరిసారిగా ఇండోర్‌లో జిలేబీలు తింటూ కనిపించారు. ఢిల్లీ మొత్తం ఈయన ఆచూకీ కోసం వెతుకుతోంది అని రాసి ఉన్న బ్యానర్లు, పోస్టర్లను రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇండియా-బంగ్లా మ్యాచ్ సందర్భంగా గంభీర్ ఇండోర్ వెళ్లాడు. ఆ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా కూడా వ్యవహరించాడు. ఆ సమయంలో ఢిల్లీ కాలుష్యంపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. దీంతో గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పోస్టర్లను కొందరు ఆప్ పార్టీ కార్యకర్తలు అంటిచినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపడుతామని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా కొందరు నేతలకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.