సహచరుడిపై హెచ్‌సీయూ విద్యార్థిని కేసు.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

సహచరుడిపై హెచ్‌సీయూ విద్యార్థిని కేసు.. ఎందుకంటే?

February 7, 2018

వారిద్దరూ విద్యార్థులు.. ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు.. సురక్షిత శృంగారంలోనూ పాల్గొంటున్నారు. అయితే సహచరుడికి ఇటీవల బుద్ధిమారింది. సరక్షిత శృంగారం వద్దని, కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనాలని ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ప్రతిఘటిస్తున్నా ఫలితం లేకపోకపోతోంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి సహచరుడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.ఇదంతా జరిగింది హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇద్దరూ పీహెచ్‌డీ చేస్తున్నారు. వారం రోజులుగా అతడు కండోమ్ లేకుండా సెక్స్ కోసం వేధిస్తున్నాడని బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు చెప్పింది. ‘అలాంటి శృంగార వల్ల ఇబ్బందులు వస్తాయి. గర్భం వచ్చే అవకాశం ఉంటుంది అని ఎంత నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు. చివరికి వేధింపులు అత్యాచారానికి కూడా దారితీసేలా మారాయి. అందుకే అతనిపై కేసు పెట్టాను.. ’ అని ఆమె చెప్పింది.