దీపావళి చూస్తుంటే దాడి చేశారు.. హెచ్‌సీయూ దళిత విద్యార్థుల ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళి చూస్తుంటే దాడి చేశారు.. హెచ్‌సీయూ దళిత విద్యార్థుల ఆరోపణ

October 29, 2019

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొందరు దళిత విద్యార్థులు.. దీపావళి రోజు ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Hcu university.

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌(ఏఎస్ఏ)కు చెందిన  పి.సుధీర్, టి. రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదివారం సాయంత్రం ఎంసీఏ విద్యార్థులు దీపావళి జరుపుకున్నారు. మేం కాస్త దూరంగా ఉండి చూస్తున్నారు. ‘మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఏఎస్ఏ సాలే, హిందువుల పండగకు మీ దళితులు ఎందుకొచ్చారు? ’ అంటూ కొందరు మమ్మల్ని కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఏడుగురిపై దాడి జరిగింది…’ అని చెప్పారు. తన కంటికి గాయమైందని సుధీర్, తన కాలికి గాయమైందని రామకృష్ణ తెలిపారు. దాడిని అడ్డుకోవడానికి ఏస్ఏ మాజీ అధ్యక్షుడు శాంసన్ రాగా 30 మంది అతనిపైనా దాడి చేశారన్నారు. కాగా తమకు దాడితో సంబంధం లేదని ఏబీవీపీ తెలిపింది. అది రెండు వర్గాల గొడవేనని సంఘం అధ్యక్షుడు అభిషేక్ మల్హోత్రా అన్నారు.