మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్‌లో ఈడీ జప్తు చేసింది.
ఇదిలా ఉండగా.. నిన్న సంజయ్ రౌత్ … రెబల్స్ ఎమ్మెల్యేలు సజీవ శవాలని వ్యాఖ్యానించారు. వారి ఆత్మలు చచ్చిపోయానని , ఆ సజీవ శవాలు ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం కోసం నేరుగా అసెంబ్లీకి పంపుతామని అన్నారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన సమన్లు పంపారు. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.