దోస్తని నమ్మితే…నిండా ముంచిండు..!

నమ్మితిరా సిధ్దా అంటే..ముంచితిరా బుద్దా అన్నట్టే ఉంది గీయ్న యవ్వారం,పేరు సుధీర్ రెడ్డి జాజాపూర్.సూపులకు అచ్చం సిన్మ హీరోలెక్కనే ఉన్నడు గనీ..మందిని ముంచుట్ల మహా ఖతర్నాక్ గాడు.తెల్శిన దోస్తుల దగ్గర,సుట్టాల దగ్గర.. పరిచయమున్నోళ్ల దగ్గర అప్పులు జేశి..అందర్కి పంగ నామాలు వెట్టిండు.వేలు గాదు,లక్షలు గాదు ఏక్థంన 2.5 కోట్ల రూపాలకు మీదనే అందర్కి ఎగ్గొట్టిండట,మరి గీయ్న సూరత్ జూశే గన్ని పైసలు అప్పిచ్చిన్రా,లేకపోతే  ఏ నమ్మకంతోని ఇచ్చిన్రని మీకు డౌట్ రావచ్చు.కనీ మనోడు అప్పిచినోళ్లకు జెప్పిన కథలు ఇంటే..నాలుగు మాతృదేవోభవ సిన్మలే గాదు,”అత్తకోసం అల్లుడి ఆరాటం”,”భార్యకోసం ఓ భర్త పోరాటం” అని ఆరు ట్రాజిడీ సిన్మలు ఈసీగ తియ్యచ్చు. నాభార్యకు భయంకరమైన బీమారుంది,మా అత్తగారికి ట్రీట్ మెంట్ జెయ్యకపోతే పాడెక్కెటట్టుంది,అని దొంగ ఏడ్పులు ఏడ్సుకుంట  అన్ని పిట్ట కథలు జెప్తే..ఎవ్వలి మన్సు కరుగది శెప్పున్రి,అయ్యో పాపం పైసలు ఇయ్యాల గాక్పోతే  రేపిస్తడు..అవుతల ఆపతి ముచ్చట అని..ఈ సుధీర్ రెడ్డి సక్కనోడని,నిక్కంగ మాపైసలు మాకు తర్వాత గడ్తరని అందరూ నమ్మిఅప్పులిచ్చిన్రు.

మల్ల ఎవ్వలకి డౌట్ రావద్దని మీ పైసలేడికోవు మా అత్తకు హైద్రాబాద్ల ఫలక్ నామా ప్యాలెసంత ఇల్లున్నది…అది అమ్మి మీ అప్పు తీరుస్తా అని  కొందరికి బ్లాంక్ చెక్కులు,ప్రామిసరీ నోట్లు గుడ ఇచ్చిండట.ఇగ వారాలు,నెలలు గడ్శిపోతున్నయ్ ఈ సుధీర్ రెడ్డి మా పైసలు ఇంకా ఇస్తలేడని సార్కు ఫోన్జేస్తే..అరె శెప్పినగదా మీ పైసలు ఏడికోవు…నేను ఊర్ల వందెకరాల ఆసామిని, తిక్కలేస్తే సగం పొలం అమ్మి మీ అప్పులు తీరుస్తా,ఎట్లాగో హైద్రాబాద్ ల అత్తగారి అద్దాల బంగ్ల ఉండనే ఉండే, బేఫికర్గ ఉండున్రి అని కల్లబొల్లి లత్కోర్ మాటలు జెప్పిండట.గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు అప్పులిచ్చినోళ్లంత సుధీర్ రెడ్డిని నమ్మిన్రు,ఇంకేముంది కాలం గడ్శిపోతుంది గనీ అప్పులైతె అస్తలెవ్వని…సుధీర్ రెడ్డికి  ఫోన్జేస్తే,ఫోన్ స్విచ్చాఫ్.మన్షి గాయబ్.

ఇంతల్నే అప్పులిచ్చినోళ్లందరికి కోర్టునుంచి ఐపి నోటీసులు వచ్చినయట,ఐపి నోటీసులల్ల ఉన్న అడ్రస్ లు, ఫోన్ నంబర్లతోని ఫోన్జేసుకుంటే అప్పులిచ్చినోళ్లందర్కి అప్పుడు తెల్శింది సుధీర్ రెడ్డి…పెద్ద బట్టెవాజ్ గాడనీ.పాపం అప్పులిచ్చినోళ్లంత ఆగష్ట్ 29నాడు కోర్టుకు పోతున్రట.సూశిన్రా నమ్మి అప్పులిస్తే సుదీర్ రెడ్డి అందర్ని నట్టేట ఎట్ల ముంచిండో,ఆపతని నమ్మి ఆదుకున్నోళ్లను..ఆఖర్కి కోర్టు మెట్లు ఎక్కిస్తుండన్నట్టు.గిసొంటి తీస్మార్కాన్లున్నంక  నిజంగా ఆపతిల ఉన్నోన్కి గుడ సాయం జెయ్యనీకి ఎవలకన్న మనసు ఒప్పుతదా?

గీ సుధీర్ రెడ్డి అనే బద్మాష్ గాడు..అత్తకు సుస్తైంది,భార్యకు బీమారైంది అని స్క్రిప్ట్ లు పట్టుకొని  మీదగ్గరికి గుడ రావచ్చు,అందుకే  గ సారు వివరాలు జెప్తున్నం.మంచిగ సద్వున్రి. మొత్తం పేరు సుధీర్ రెడ్డి జాజాపూర్,మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం,కిష్ట్రాపూర్ అనే గ్రామం.2006ల లండన్ కెల్లి జాబ్ జేశిండు,ఆతర్వాత అచ్చిహైద్రాబాద్ లున్న హిమాయత్ నగర్ల సోలార్-4  గ్రీన్ ఇండియా అనే కంపినీని వెట్టిండు,మందిని ముంచిన పైసలాయే కంపిని వెడ్తడు,ఇంకేమన్న వెడ్తడు.ఈయ్న కథలు నమ్మి అప్పులిచ్చినోళ్లకు దొర్కకుంట ఇంక మస్తు బిజినెన్లు గుడ జేశిండట.ఈసుధీర్ రెడ్డి సారు సక్కదనానన్కి…. ఓ ఫ్యాన్సీ ఫోన్ నంబర్ గుడ ఉంది.(8106688887),ఫ్యాన్సీ నంబర్లు,టిప్ టాప్ గుంటనే గదా అందరు అప్పిచ్చేది,కనీ జరంతనన్న సిగ్గుండాలే…ఆపతున్నదని జెప్పి గింత మోసం జేస్తాడు,ఇసోంటోళ్లకు పుట్టగతులండయ్ అని మస్తు తిట్టుకుంటున్నరట…గీ సుధీర్ రెడ్డి లీలలు తెల్శినోళ్లంత.

SHARE