He competed with the ambulance..in the end he was damaged
mictv telugu

అంబులెన్స్‌తో పోటీ పడ్డాడు..చివరికి దెబ్బతిన్నాడు

June 30, 2022

He competed with the ambulance..in the end he was damaged

భారతదేశంలో నూటికి 90 శాతం మంది అంబులెన్స్‌ హారన్ వినబడింది అంటే చాలు మన వాహనం ముందు ఎన్ని వాహనాలు ఉన్నా, ఎంత ట్రాఫిక్ ఉన్నా, అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని తెగ ప్రయత్నం చేస్తుంటారు. అలాగే, అత్యవసర సేవలో ఉండే అంబులెన్స్‌కు దారి ఇవ్వటం కోసం పోలీసులు సైతం రెడ్ సిగ్నల్స్‌ ఉంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ వేసి అంబులెన్స్‌ను పంపిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా, అంబులెన్స్‌తో పోటీపడి చివరికి ప్రమాదానికి గురైయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీడియోలో… ఓ కారు డ్రైవర్ కావాలనే అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా అంబులెన్స్ కంటే వేగంగా కారును నడిపుతున్నాడు. అపదలో ఉన్న వ్యక్తిని కాపాడటం కోసం అంబులెన్స్ డ్రైవర్ పదే పదే హారన్ కొడుతున్నాడు. అయినా, హారన్ పట్టించుకోకుండా ఆ కారు డ్రైవర్ అంబులెన్స్‌తో పోటీ పడ్డాడు. ఓవైపు వర్షం, మరోవైపు రోడ్డు పక్కనే వరద నీరు చేరింది.

అయినా, ఆ కారు డ్రైవర్ అవేమీ పట్టించుకోకుండా కారు వేగాన్ని పెంచుకుంటుపోయాడు.అంతలోనే ఓ ట్రక్కును ఓవర్ టెక్ చేయబోయి, చివరికి ప్రమాదానికి గురయ్యాడు. స్పీడ్ ఎక్కువ అవడంతో కంట్రోల్ తప్పి, స్కిడ్ అయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను కారు ఢీకొట్టింది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ కారు డ్రైవర్‌పై తీవ్రంగా మండిపడుతూ, తెగ కామెంట్స్ చేస్తున్నారు.