' He could not bear a single word: Divyavani
mictv telugu

ఆయనను ఒక్క మాటన్నా తట్టుకోలేను: దివ్యవాణి

June 2, 2022

' He could not bear a single word: Divyavani

‘చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు. ఈ మాటను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చెపుతా. నేను ఎప్పుడూ ఎవరి భజన చేయాను. ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారని, నేను కూడా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నా. టీడీపీ అధినేతను కొందరు రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు. చంద్ర బాబును ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను’ అని సినీ నటి దివ్యవాణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి చంద్రబాబుతో ఆమె భేటీ అయిన అనంతరం టీడీపీకీ రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. ఆ ప్రకారమే కాసేపటిక్రితమే ఆమె మీడియా ముందు రాజీనామా విషయాలను వెల్లడిస్తూ, కంటతడి పెట్టుకున్నారు. తనకు ప్యాకేజీ అందిందని కొందరు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘నేను ప్యాకేజీ తీసుకుని రాజీనామా చేయలేదు. రాజీనామా చేసేందుకు పూర్తి క్లారిటీ తీసుకోవడానికే ఇప్పటి వరకు ఆగాను. ఏడాది కాలంగా పార్టీలో నాకు ప్రధాన్యతను తగ్గించారు. పార్టీలో నా స్థానం ఏమిటో కూడా నాకు తెలియని పరిస్థితి. పార్టీ ఆఫీస్‌లో కనీసం ప్రెస్‌మీట్‌లు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. టీడీపీకి ఎంతో సేవ చేశాను. కానీ, ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు’.