Home > Featured > కరీంనగర్‌లో కామాంధుడికి తాట తీశారు..

కరీంనగర్‌లో కామాంధుడికి తాట తీశారు..

Karimnagar ..

కామాంధుల ఆట కట్టించాలంటే అతివలే నడుం బిగించాలి. ఒక మగాడు తనపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే మరో మగాడు వచ్చి తనను కాపాడుతాడు అని ఆమె అనుకున్నంత కాలం ఈ నేరాలకు అంతువుండదు. ఇవి అంతమొందాలంటే అతివలే ఆదిపరాశక్తులు కావాలి. అతివ తెగింపే తన రక్షణ కవచం అవుతుందని ఈ ఘటన అద్దం పడుతోంది. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ కామాంధుడు కాలేజీ ఆవరణలోనే వేధించాడు. ఆమె ధైర్యంగా అతని కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చింది. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఃతిమ్మాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు ఓ అమ్మాయి వచ్చింది. అక్కడే ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వెంకటేష్ ఆమె మీద ఎప్పటినుంచో కన్నేశాడు. కాలేజికి ఆమె రావడంతో ఇదే అదునుగా భావించిన ఆ కామాంధుడు ఆమెను వేధించసాగాడు. అతని వేధింపులకు ఆమె బెదిరిపోలేదు. గుండెలో ధైర్యం నింపుకుని అతని కాలర్ పట్టుకుంది. బరబరా అతన్ని బయటకు ఈడ్చుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు వెంకటేష్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే తన ప్రవర్తన పట్ల వెంకటేష్ పశ్చత్తాపం వ్యక్తం చేశాడు. తనను క్షమించాలని కోరుతూ యువతికి లేఖ కూడా రాసి ఇచ్చాడు. కాగా, అమ్మాయి చూపిన తెగువ పై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అందరు అమ్మాయిలు ఆమెలా తన సమస్యను తానే సావధానించుకుంటే ఇలాంటి కామాంధుల ఆట కట్టించవచ్చని అన్నారు.

Updated : 20 Aug 2019 6:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top