ఆయన తెలుగువారి సైనికుడు.. మా ధైర్యం: లోకేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన తెలుగువారి సైనికుడు.. మా ధైర్యం: లోకేశ్

April 20, 2022

18

టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం పలువురు రాజకీయ నాయకులు, సినీ హీరోలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయనకు భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. “పుట్టిన రోజు సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. తెలుగువారికి చంద్రబాబు అంటే ఒక భరోసా. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్ల మందికి అన్నదాత అయ్యారు. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. సొంత కుటుంబం కాకుండా తెలుగుజాతినే కుటుంబం చేసుకున్నారు. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్’ అని లోకేశ్ ట్విట్ చేశారు.

మరోపక్క చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొంతమంది కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది చంద్రబాబు పేరుతో పలు సేవ కార్యక్రమాలు చేశారు.