మోదీ విమర్శలు.. ఈసీకి రక్తంతో లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ విమర్శలు.. ఈసీకి రక్తంతో లేఖ

May 8, 2019

ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రాజీవ్‌గాంధీ అవినీతిలో నంబర్ వన్ అని విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, మోదీ.. రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు, రాజీవ్ గాంధీ అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్య రాజీవ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ ప్రాంత ప్రజలు మోదీ తీరుపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని ఏకంగా రక్తంతో ఎన్నికల సంఘానికి లేఖ రాయడం సంచలనం అవుతోంది.

'He Lives in Our Hearts': Amethi Youth Writes Letter in Blood to EC Against Modi's Remark on Rajiv Gandhi

ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలోని షాగర్‌కు చెందిన మనోజ్ కశ్యప్ అనే వ్యక్తి ఈసీకి రక్తంతో లేఖను రాశాడు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది లేఖ రాసినట్లు తెలిపాడు. మోదీ వ్యాఖ్యలు అమేథీ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసాయన్నాడు. 18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు, దేశంలో కంప్యూటర్ విప్లవం మొదలగు అనేక సంస్కరణలకు రాజీవ్‌ గాంధీ పునాది వేసాడని కొనియాడాడు. దివంగత మాజీ ప్రధాని వాజపేయి కూడా రాజీవ్‌ను పలు మార్లు పొగిడిన విషయాన్నీ కూడా లేఖలో గుర్తుచేశాడు. రాజీవ్‌గాంధీని అవమానించే ఎవరినైనాసరే అమేథీ ప్రజలు రాజీవ్‌ను హతమార్చిన వారిని చూసిన మాదిరిగానే చూస్తారన్నారు. దేశ ప్రజలు అదేవిధంగా అమేథి ప్రజల గుండెల్లో రాజీవ్ ఇంకా జీవించే ఉన్నాడన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రధానికి ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరాడు. లేఖను కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు.