బీజేపీలోకా? చచ్చేంతవరకు మా పార్టీలోనే.. దివ్యవాణి - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలోకా? చచ్చేంతవరకు మా పార్టీలోనే.. దివ్యవాణి

August 21, 2019

Telugu Desam Party until he died.. Divyavani

టీడీపీ అధికార స్పోక్ పర్సన్స్  నటి దివ్యవాణి, యామినీ సాధినేనిలు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. అయితే వీటిపై దివ్యవాణి స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని అన్నారు. చచ్చేంతవరకూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని.. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె ట్విటర్‌లో తెలిపారు. 

ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు.. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత కొద్ది రోజులు పార్టీలో పని చేసిన దివ్య వాణి క్రమేణా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెపై రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లా సమీకరణాల్లో భాగంగా దివ్యవాణికి టికెట్ దక్కలేదు. అయినా కూడా ఆమె పార్టీపై విముఖత చూపలేదు. మరోవైపు, దివ్యవాణి కూడా చాలాకాలంగా మీడియా ముందుకు రాకపోవడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. ఎట్టకేలకు ఆమె స్పందించడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది.