లవర్ లేనోడి తిప్పలు.. తనను ఎవరైనా కొనుక్కోవాలట..  - MicTv.in - Telugu News
mictv telugu

లవర్ లేనోడి తిప్పలు.. తనను ఎవరైనా కొనుక్కోవాలట.. 

October 2, 2020

He put himself up for sale for a girlfriend.

‘ఈ టైంలో నీ ఫోన్ బిజీ వస్తోంది ఎందుకు? నాకు గిఫ్ట్ కావాలి? నాకు గోరుముద్దలు తినిపించు.. నాతో ఎక్కువ సమయం గడుపు.. నన్ను ముద్దుగా బేబీ, జాను, బంగారం అని పిలువు’ ఇలా గర్ల్‌ఫ్రెండ్‌లు బాయ్‌ఫ్రెండ్‌లను కోరడం తెలిసిందే. ఆ సమయంలో ప్రియురాలిని మెప్పించడానికి ప్రియుడు పడే తిప్పలుచాలా ఉంటాయి. అప్పుడు చాలామంది యువకులు అనే మాట ‘అనవసరంగా లవ్వులో పడ్డాను’ అని. అయితే ఇలాంటి అనుభవం లేదని సోషల్ మీడియాలో ఓ లవర్ లేనోడు తననితాను అమ్మకానికి పెట్టుకున్నాడు. మరి అతను నిజంగానే అమ్ముడుపోయాడా? అతని పేరు లాన్‌ క్లేటన్(30). లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న క్లేటన్ గత పదేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నాడు. తన స్నేహితుల్లో కూడా చాలామందికే ఇప్పటికే పెళ్లిళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ క్లేటన్‌ మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. వారిని చూసినప్పుడల్లా అతనికి కూడా అలాంటి ఒక కుటుంబం కావాలని ఆశపడ్డాడు. ఈ మధ్యకాలంలో అతను గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆన్‌లైన్‌లోని వివిధ యాప్స్‌లో వెతికాడు. ప్రత్యక్షంగా నచ్చిన అమ్మాయికి తన లవ్ ప్రపోజ్ చేశాడు. అతను ఎంత చేసినా ఏ అమ్మాయి అతని లవ్వును ఆమోదించలేదు. దీంతో ఎలాగైనా ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సంపాదించుకోవాలనే పట్టుదలకు వచ్చాడు. ఈ నేపథ్యంలో అతను వినూత్నంగా తనను తాను ఫేస్‌బుక్‌ పేజీలో అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు. ‘నేను సింగిల్‌.. గుడ్‌ కండీషన్‌లో ఉన్నా’ అని పేర్కొన్నాడు. 

అంతేగాక క్లేటన్‌ ఇలా తనను తాను అమ్మకానికి పెట్టుకోవడం వెనుక కారణాన్ని కూడా వివరించాడు. ‘హలో ఆల్‌ లేడీస్‌.. నాపేరు క్లేటన్‌. నా వయస్సు 30 ఏళ్లు. గత పదేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నా. నాతో ప్రేమగా మాట్లాడే అమ్మాయి కోసం పదేళ్లుగా వెతుకుతున్నా. కొన్ని పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉన్నా సింగిల్‌గా ఉండడంతో వెళ్లలేకపోయాను. ఏ పెళ్లికి వెళ్లినా జంటగానే వెళ్లాలని నిశ్చయించుకున్నా. ఎన్నో డేటింగ్‌ యాప్స్‌ వెతికాను. అదేంటోగానీ నాకు అవి వర్కవుట్‌ కాలేవు. అందుకే ఈసారి కొత్తగా ఆలోచించి ఫేస్‌బుక్‌లో నన్ను నేను అమ్మకానికి పెట్టుకున్నా. నన్ను ఒకసారి పరిశీలించండి. నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి’ అని తన మనసులో మాటలను వెలిబుచ్చాడు. అయితే అతను ప్రతిసారి విఫలం అయినట్టు ఈసారి కూడా విఫలం అవలేదు. అతను షేర్‌ చేసిన పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అతను షేర్‌ చేసిన ఫోటోలకు వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. ‘క్లేటన్‌ మీ ఆశ తప్పక నెరవేరుతుంది’ అని ఒకరు కామెంట్ చేశారు. కాగా, ఎప్పటికైనా తన జీవితంలోకి ఎవరో ఒక అమ్మాయి తప్పకుండా గర్ల్‌ఫ్రెండ్‌గా వస్తుందని.. ఆమెతో తన జీవితం సంతోషంగా గడుపుతానని క్లేటన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. చూడాలి మరి క్లేటన్ కలలు కంటున్న గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతుందో లేదో.