టెస్ట్ చేస్తా అన్నాడు, కారుతో తుర్రుమన్నాడు.. చివరికి - MicTv.in - Telugu News
mictv telugu

టెస్ట్ చేస్తా అన్నాడు, కారుతో తుర్రుమన్నాడు.. చివరికి

May 16, 2022

కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఓ వ్యక్తి కారును టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి, ఆగకుండా వెళ్లిపోయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో చాకచాక్యంగా పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు.

బెంగళూరు కాఫీ బోర్డు లే అవుట్ నివాసి రవీంద్ర ఎల్లూరి (47) తన మారుతి విటారా బ్రెజ్జా కారును విక్రయిస్తాను అని ఓఎల్ఎక్స్‌లో యాడ్ పెట్టాడు. దాంతో ఐదుగురు స్పందించారు. అందులో చక్కబళ్లాపుర, అమృత్ నగర్ నివాసి అయిన ఎంజీ వెంకటేశ్ నాయక్ కారును కొంటానని, వెంటనే కలుద్దామని కబురు పెట్టాడు. దాంతో ఎల్లూరిని కారును తీసుకొని వచ్చాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానంటే వెంకటేశ్ కీ ఇచ్చాడు. ఇక అంతే ఇంజన్ స్టార్ట్ చేసిన వెంకటేశ్, వెనక్కి తిరిగి రాకుండా అదృశమయ్యాడు. దాంతో ఎల్లూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముందుగా ఓఎల్ఎక్స్ టీమ్ ఇచ్చిన 2,500 ఐపీ చిరునామాలను పరిశీలించారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చివరికి మే 10న అతడిని పట్టుకున్నారు.