తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష: కేటీఆర్

April 20, 2022

ktr

తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో బుధవారం కేటీఆర్ రూ.43 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేసి, చెన్నరావుపేట, దుగ్గొండి మండలాల్లో మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..”కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానివి అన్నీ వట్టి మాటలే. ఏ ఒక్క పని చేతల్లో చేసి చూపించిన దాఖలలు ఎక్కడా కనిపించడం లేదు. దేశంలో ఏ రాష్ట్రం పెట్టలేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుంది. త్వరలోనే వ్యవసాయాధారిత శుద్ది పరిశ్రమలు తీసుకురానున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆ బాధ్యత ఉందా? ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. ఏనాటికైనా మన ఇంటి పార్టీయే ప్రజలకు శ్రీరామరక్ష అవుతుంది. మన ప్రయోజనాలను కాపాడుతుంది” అని కేటీఆర్ అన్నారు.