ఆమెకు 80, అతనికి 35.. ఎంత ఘాటు ప్రేమయో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెకు 80, అతనికి 35.. ఎంత ఘాటు ప్రేమయో..

January 27, 2020

80 Years Old Women

ఈడూజోడూ కుదిరితే చూడముచ్చటగా ఉంటుంది. పర్‌ఫెక్ట్‌గా కుదరకపోయినా, ఐదారేళ్లు తేడా ఉన్నా పెద్దగా కంగారుపడాల్సిన లేదు.  కానీ ఏకంగా నలభై ఏళ్ల తేడా ఉంటే ఎలా? కాపురం, పిల్లాజెల్లా సంగతి ఏంటి?

 ఆమె వయసు 80 ఏళ్లు.. అతనికి 35 ఏళ్లు. ఆమె వయసులో అతనిది సగానికన్నా తక్కువ వయసు. టూకీగా చెప్పాలంటే ఆమెకు మనవడి వయసు ఉంటుంది అతనిది. త్వరలో ఈ ప్రేమికులు పెళ్లితో ఒక్కటి కానున్నారు. వారిద్దరికి లంకె ఎలా కుదిరింది? జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు కాస్త ఈడు జోడు చూసుకోవక్కర్లేదా? అయినా మనవలు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఏంటి బామ్మ నీకీ కోరిక? అంటూ యూజర్లు వారిపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. కొందరేమో వారి ప్రేమకు జోహార్లు అంటున్నారు. ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం, వయసుతో సంబంధం లేదు అని ప్రోత్సహిస్తున్నారు.   

ఇంగ్లాండ్‌కు చెందిన ఐరిస్ జోన్స్(80) అనే వృద్దురాలు, ఈజిప్టుకు చెందిన మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం(35) ఫేస్‌బుక్‌లో ఉన్న ఓ నాస్తికుల గ్రూపులో మెంబర్లుగా ఉన్నారు. ఆ గ్రూపు ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. పరిచయం అయిన గంటల వ్యవధిలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. మహమ్మద్ ఐరిస్ జోన్స్‌కు ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె కూడా అతని ప్రేమకు ఆమోదం తెలిపింది. అలా కొంతకాలం వారు ప్రేమలో మునిగి తేలారు. కారు, షికార్లకి వెళ్లారు. ఐరిస్ అతడిని కలిసేందుకు గత నవంబర్‌లో ఇంగ్లాండ్ నుంచి కైరోకు వెళ్లింది. కైరోలో వీరిద్దరూ కలుసుకున్న కొద్ది సేపటికే శృంగారంలో కూడా పాల్గొన్నట్టు ఐరిస్ తెలిపింది. మహమ్మద్‌తో తాను కలిసిన తరువాత పెళ్లి కాకముందు ఒక అమ్మాయి ఎలాంటి అనుభూతి చెందుతుందో అలాంటి అనుభూతే చెందానని వెల్లడించింది. ఈజిప్టులోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని, అక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. 

అంతా బాగుందన్న సమయంలో బామ్మ కొడుకులు వారి పెళ్లికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహమ్మద్ డబ్బు కోసమే మా అమ్మను ప్రేమిస్తున్నాడంటూ ఐరిస్ కొడుకులు స్టీవ్(54), డ్యారెన్(53) పెళ్లిని అడ్డుకుంటున్నారు. అయితే కొడుకుల ఆరోపణ సరైంది కాదని ఐరిస్ కొట్టి పారేసింది. తాను ప్రస్తుతం పెన్షన్ డబ్బులతోనే జీవిస్తున్నానని.. ఆ పెన్షన్ డబ్బులు తప్ప తన దగ్గర ఇంకేం ఉన్నాయంటూ ఐరిస్ కొడుకులను ప్రశ్నించింది.  మహ్మద్ కూడా ఐరిస్‌ను గాఢంగా ప్రేమిస్తున్నానని.. ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటున్నాడు. మహమ్మద్, ఐరిస్ పెళ్లికి మహమ్మద్ తల్లి కూడా అంగీకరించడం విశేషం. మరోవైపు వీరి పెళ్లికి చట్టపరమైన చిక్కులు కూడా వచ్చి పడ్డాయి. ఐరిస్ 40 ఏళ్ల క్రితం తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చింది. ఐరిస్ మరొకరిని చట్టబద్దంగా పెళ్లి చేసుకునేందుకు అధికారుల నుంచి కొన్ని సర్టిఫికెట్లను పొందాల్సి ఉంది.