He was the same person as Lakkana..he hit the jackpot on the day after his marriage
mictv telugu

లక్కంటే ఇతడిదే..పెళ్లైన మరుసటి రోజే జాక్‌పాట్ కొట్టేశాడు

July 16, 2022

He was the same person as Lakkana..he hit the jackpot on the day after his marriage

లండన్‌కు చెందిన రీస్ అనే 26 ఏళ్ల యువకుడిని అదృష్టం వరించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మరుసటి రోజే పెద్ద జాక్‌పాట్‌ను కొట్టేశాడు. Mahzooz అనే లక్కీ డ్రాలో అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు 10 మిలియన్ దిర్హమ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.21.7కోట్లు) గెలుచుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. లండన్‌కు చెందిన రీస్ అనే యువకుడు 22 ఏళ్ల వయసులో స్వదేశాన్ని వీడిచి, ఉపాధి కోసం విదేశాల బాటపట్టాడు. చివరికి దుబాయ్‌లో ఓ జిమ్ మ్యానేజర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ జిమ్‌లోనే ఓ అమ్మాయిని చూసి ఆమెపై మనసు పారేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పాడు. దాంతో అతని ప్రేమను ఆమె అంగీకరించింది. ఒక నాలుగు సంవత్సరాలపాటు ప్రేమలో మునిగితేలారు.

తాజాగా రీస్ తాను ప్రేమించిన యువతిని పెళ్లాడాడు. ఊహించని రీతిలో మరుసటి రోజే అతడిని అదృష్టం వరించింది. Mahzooz లక్కీ డ్రాలో అతడికి 10 మిలియన్ దిర్హమ్‌లు గెలుచుకున్నాడు. దాంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రీస్ మాట్లాడుతూ.. ”ఇది నాకు బెస్ట్ మ్యారేజ్ గిఫ్ట్. వెబ్‌సైట్‌లో నేను విజేత అని గుర్తించి, క్షణంపాటు ఆశ్చర్యానికి లోనైయ్యాను. అనంతరం ఆ విషయాన్ని నా భార్యకు చెప్పాను. దాంతో ఆమె పట్టలేనంత ఆనందంతో కళ్ల నుంచి నీళ్లు తెచ్చుకుంది. నేను గెలిచిన డబ్బును ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేస్తా” అని అన్నాడు.