He won Rs. 10 thousand crores.. but do not know who he is?
mictv telugu

రూ.10 వేల కోట్లు గెల్చుకున్నాడు..కానీ, అతనెవరో తెలియదు?

August 11, 2022

అమెరికా దేశానికి చెందిన ఓ అజ్జాత వ్యక్తికీ లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. కానీ, ఆ పదివేల కోట్ల రూపాయలను ఆ వ్యక్తి అందిపుచ్చుకునే అవకాశం మాత్రం దక్కలేదు. ఎందుకంటే..ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడుంటాడు? అనే వివరాలు తెలియలేదు. దాంతో అతడు గెల్చుకున్న ఆ పదివేల కోట్ల రూపాయలను ఎవరికి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అనే ఆలోచనల్లో పడ్డారు లాటరీ యాజమానులు.

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా అమెరికా దేశంలో మెగా మిలియన్స్ అనే సంస్థ నిర్వహించిన లాటరీలో ఓ వ్యక్తి రెండు డాలర్లు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ రెండు డాలర్లు అతన్ని కోటీశ్వరుడ్ని చేశాయి. ఆ లాటరీలో అతనికి ఏకంగా 1.28 బిలియన్ డాలర్ల (అంటే ఇండియన్‌ కరెన్సీలో 10,136 కోట్లు) జాక్‌పాట్ తగిలింది. లాటరీ కొట్టిన ఈ టికెట్ వివరాలను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.

”ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ టికెట్ అమ్ముడైంది. కానీ, ఆ వ్యక్తి ఎవరనే విషయం ఇంకా తెలియలేదు. ప్రభుత్వ ఆధర్యంలో నిర్వహించినా ఈ లాటరీలో 2015 నుంచి జరిగిన 29 డ్రాలో ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ఇంతపెద్ద జాక్‌పాట్‌ను కొట్టిన దాఖలాలు లేవు. మొదటిసారిగా ఈ వ్యక్తికి అదృష్టం వరించింది. కానీ అతడు ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునే అవకాశం లేకుండా పోయింది” అని మెగా మిలియన్స్ తెలిపింది.

అయితే, అమెరికాలో గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద జాక్‌పాట్ అని సంస్థ అధికారులు తెలిపారు. అంతేకాదు, అమెరికా దేశ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద జాక్‌పాట్ అని, ఆ అజ్జాత వ్యక్తికి అదృష్టం వరించినా, అతని ఆచూకీ లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకావటం లేదని వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఈ లాటరీ డబ్బులు ఎప్పుడు తీసుకుంటాడో అనే అంశాలు అమెరికా దేశంలో హాట్ టాఫిక్‌గా మారింది.